చంచల్ గూడ లో శనివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. మహమ్మద్ ప్రవక్తపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ ను అరెస్ట్ చేయాలంటూ ముస్లిం జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. ప్రవక్తపై తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయటం లేదంటూ ప్రశ్నించారు. ప్రవక్తపై జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని, బీజేపీ నేతల అరెస్ట్ కోసం దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేయాలని జేఏసీ నేతలు అంతకు ముందు జరిగిన బహిరంగ సభలో తీర్మానం చేశారు.